మధుమేహం అంటే…
రక్తంలో అత్యధికంగా చక్కర శాతం ఉండటం వల్ల దాని ప్రభావం శరీరంలోని ఇతర అవయవాలపై
దుష్ప్రభావాన్ని చూపుతుంది.
మధుమేహం రెండు రకాలు.
1. మొదటి రకం: క్లోమగ్రంధీలో ఇన్సులిన్ ఉత్పత్తి లేకపోవడం.
2. రెండవ రకం; రక్తంలో అత్యధికంగా ఇన్సులిన్ ఉండటం, దానికి కారణం రక్తంలో అత్యధికంగా చక్కర
ఉండటం వల్ల ఆది ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరెపిస్తుంది.
రెండవ రకం మధుమేహాన్ని తగ్గించుకోవడం, రాకుండా కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది.
రక్తంలో ఇన్సులిన్ తగ్గాలంటే మనం తీసుకునే ఆహారంలో చక్కర శాతాన్ని తగ్గించి దాని స్థానంలో
సంక్లిష్టమైన పిండి పదార్థాలు తీసుకున్నట్లైతే చాలావరకు విజయం సాధించవచ్చు.
ఉదాహరణకు మన శరీరం ఒక చక్కర గిన్నె అనుకుంటే, మనం పుట్టినపుడు గిన్నె ఖాళీగా ఉంటుంది.
కాని కొన్ని దశాబ్దాలు మన ఆహారంలో రెఫైండ్ చక్కర పధార్థాలతో నింపినట్లైతే ఆ గిన్నె నిండి చక్కర
బయటకు చిమ్మడం జరుగుతుంది. అప్పుడు మన శరీరం చక్కర ను తగ్గించడానికి ఇన్సులిన్ ఉత్పత్తిని
ప్రేరెపిస్తుంది. ఇన్సులిన్ రక్తంలోని చక్కరను కణాల లోకి పంపించడానికి తోడ్పడుతుంది. కాని మనం
రక్తంలోకి చక్కరలు పంపడం ఆపకపోతే ఇన్సులిన్ పనిచేయడం ఆగిపోతుంది. దీనినే వైద్య పరిభాషలో
ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఆది క్రమేణా మధుమేహ వ్యాధిగా స్థిరపడుతుంది.
చాలా వైధ్యవిదానాలు రక్తంలోని చక్కర ను అదుపు చేయడానికే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మధుమేహ
రోగుల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఎప్పుడైతే మన ఆహారంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తామో అప్పుడే
మధుమేహం అదుపులోకి వచ్చి, నియంత్రించబడి జబ్బు తిరోగామనానికి దారి తీస్తుంది. ఈ చిన్న
విషయాన్ని గమనిస్తే సమాజంలో రెండవ రకం మధుమేహన్ని కనుమరుగు చేయవచ్చు.
మధుమేహాన్ని అదుపుచేయని పక్షంలో ఆది శరీరంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు పాటించవలసిన జాగ్రతలు
1. భోజన వేళలను క్రమం తప్పకుండా పాటించాలి.
2. మనం తీసుకునే ఆహారంలో అత్యధికంగా సంక్లిష్టమైన పిండి పధార్థలు అనగా చిరుధన్యాలు
(కొర్రలు,అరికలు, సామలు, ఉధలు, ఆండ్రకొర్రలు మొ||నవి) ముడి ధాన్యాలు(ధంపుడు బియ్యము)
రెఫైండ్ చేయని పదార్థాలతో బాటు అన్నిరకాలైన కూరగాయలు, ఆకు కూరలు, మొలకెత్తిన గింజలు
విరివిగా తీసుకోవాలి.
3. సాద్యమైంనంత వరకు దుంప కూరలకు దూరంగా ఉండాలి.
4. మన భోజనంలో అన్నము మరియు రొట్టెల కన్నా ఉడికించిన కూరగాయలు ఎక్కువ మోతాదులో
ఉండే విధంగా చూసుకోవాలి.
5. పండ్లలో ఆపిల్, దానిమ్మ, జామ, నారింజ, బత్తాయి మరియు బొప్పాయి పండ్లు తీసుకొనవచ్చు.
6. పండ్ల రసాలు త్రాగరాదు. బేకరీ పదార్థాలు మరియు కూల్ డ్రింక్స్ తీసుకొనరాదు.
పండ్లను తినడం వల్ల అందులోని పీచు పదార్థాలు రక్తంలోని చక్కర శాతాన్ని తగ్గించి, ఆరొగ్యకరమైన
కొవ్వులను పెంచి, జీర్నశక్త్థిని పెంపొందించి, మలవిసర్జన సుఖవంతంగా ఉండుటకు సహకరిస్తాయి.
7. పండ్లలో మామిడి, అరటి, ద్రాక్ష, సపోటా మరియు సీతాఫలం లో చక్కర శాతం అధికంగా ఉంటుంది
కావున మధుమేహారోగులు జాగ్రత వహించాలి.
8. రెడ్ మీట్, అవయవాలకు సంబంధించిన మాంసం (లీవర్, కిడ్నీ, స్ప్లీన్, బ్రేన్) గుడ్దులోని పచ్చ సొన,
రొయ్యలు మరియు పీతలు సాద్యమైనంత వరకు తీసుకొనక పోవడం ఉత్తమం.
9. ఆహారంలో అధికంగా ఉప్పుకలిగిన పదార్థాలు ఉరగాయలు, పచ్చళ్ళు, అప్పడాలు, వడియాలు,
పొడులు మరియు నిల్వ ఉంచిన పదార్థాలు తీసుకొనరాదు.
10. రోజుకి కనీసం 2 నుండి 3 లీటర్లు నీరు త్రాగాలి.
11. ప్రతి దినం క్రమం తప్పకుండా 45 ని||ల నుండి 1 గం|| వరకు వ్యాయామం చేయాలి.
12. ఒకసారి మరిగించిన నునెలను మళ్లీ వంటలలో వాడరాదు.
13. ధూమపానం, అల్కహల్ పూర్తిగా మానివేయాలి.